- ఇంటింటికీ తిరుగుతాం
- టీడీపీ, జనసేన కలయికనే ప్రజలు కోరుకుంటున్నారు
- మాజీ మంత్రి పొంగూరు నారాయణ..
- రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది
- జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి
- జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశం
నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు అధికంగా సృష్టించి, ఓటర్ల జాబితాని తారుమారు చేసి రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి పొంగూరు నారాయణ ఆరోపించారు. గురువారం జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 2019లో ఒక్క నెల్లూరు సిటీలోనే సుమారు 15వేల దొంగ ఓట్లను వైసీపీ వాళ్లు నమోదు చేశారని ఆరోపించారు. అందుకోసమే..టీడీపీ, జనసేన పార్టీలు కలిసి...డోర్ టూ డోర్ తిరిగి...ఓటర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలపైన చెత్త పన్ను వేసిన ఏ-కై-క సీఎం జగన్మోహన్రెడ్డేనని ఎద్దేవా చేశారు. పేరుకే చెత్త పన్ను అని...కానీ ఊరంతా చెత్తమయమైపోయిందన్నారు. నగంలో ఏ ఇంటికెళ్లినా... ప్రజల బాధల వింటు-ంటే కడుపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు చార్జీలు భారీగా పెంచేసి...నిరుపేదలపై భారాలు మోపడం దారుణమన్నారు. ప్రజలందరూ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, గతంలో చేసిన పొరపాటుని ఈ సారి చేయమని, టీడీపీ, జనసేనలని గెలపించుకుని తీరుతామని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, జగన్ మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంతో ఇప్పటికే ప్రజలు విసుగుచెందారని, మార్పు కోరుకుంటు-న్నారని తెలిపారు. జనసేన, టీడీపీ కలయికని ప్రజలందరూ స్వాగతిస్తు న్నారని చెప్పారు. 2024లో.. టీడీపీ, జనసేన భారీ విజయం సాధించి... ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 2024లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసే న కార్యకర్తల మీద వైసీపీ అక్రమంగా కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటానని కోటంరెడ్డి భరోసా ఇచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ చేతగాని పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. ఆయన సమయమంతా టీడీపీ, జనసేన నాయకుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి. ఎలా కేసులు పెట్టాలన్న దానిపై కేటాయించడం సిగ్గుచేటన్నారు. ప్రజా అభివృద్ధిపైన, ప్రజా సంక్షేమంపైన సీఎం దృష్టి పెట్టిన దాఖలాలు లేవని విమర్శించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com