అనంతపురం ( జనస్వరం ) : అధికార వైసిపి ఆగడాలను అడ్డుకుంటాం.. ప్రజా క్షేత్రంలో వైను.. మైను.. సాండ్ అక్రమాలపై ఉద్యమిస్తామని జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం సప్తగిరి సర్కిల్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు జనసేన కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అధికార వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆ పార్టీ నేతల్లో భయం మొదలైందన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సాధించామని.. అందులో భాగంగా బూత్ లెవెల్ నుంచి క్యాడర్ నిర్మిస్తామన్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యకర్తలే తమ పార్టీ బలమన్నారు. స్థానిక సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ దురాహంకార ప్రభుత్వ మెడలో వంచాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, తాడపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్, హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకులు ఉమేష్, ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య జిల్లా ప్రధాన కార్యదర్శులు దాసరి రామాంజనేయులు, కుమ్మర నాగేంద్ర, అబ్దుల్, కార్యదర్శులు రాపా ధనంజయ్, సంజీవ రాయుడు, మణికంఠ, కిరణ్ కుమార్, AV రమణ, సిద్దు, మారేష్, జయమ్మ, బొంగరం శీన, నారాయణస్వామి, విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, బాల్యం రాజేష్, శివ (పరిగి), కృష్ణమూర్తి, జనగాని మధు, రామాంజనేయులు మరియు తదితరులు పాల్గొన్నారు.