
రాంనగర్, (జనస్వరం) : అనంతపురం పట్టణం, రాంనగర్ లో జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారి స్వగృహంలో వడ్డెర సంఘం నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వడ్డెర సమస్యలను వివరిస్తూ ST జాబితాలో చేర్చాలని, క్వారీ వర్కులలో వడ్డెర్లకు 80% వర్కులు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ మాట్లాడుతూ వడ్డెర సమస్యలను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంఛార్జ్ శ్రీ సాకే పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నాగేంద్ర, జనసేన నాయకులు శ్రీ పొదిలి బాబురావు, వడ్డెరలు శ్రీ B.పొలన్న, శ్రీ BC.పోలన్న, శ్రీ D.రామాంజనేయులు, శ్రీ V.రాజు, శ్రీ A.వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.