Logo
Date of Publish : 28 October 2022, 3:21 pm
Editor : Sake Naresh

పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

       నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 165వ రోజున 48వ డివిజన్ ఆనం వెంకటరెడ్డి కాలనీ ప్రాంతంలో నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వారు తమ దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్న తమ జీతాలను కూడా వైసీపీ ప్రభుత్వం సరైన సమయానికి వేయట్లేదని, దీంతో ప్రతి నెలా నెలసరి వాయిదాల సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఒప్పంద కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ప్రభుత్వం కనీస వేతనాల అంశంలో జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని, ఆ జీవోలు అమలు కావట్లేదని పలువురు కేతంరెడ్డి వద్ద వాపోయారు. రానున్నది పవనన్న ప్రభుత్వమే అని, తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్మికునికి అండగా నిలుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com