Logo
Date of Publish : 27 February 2023, 3:48 pm
Editor : Sake Naresh

ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 287వ రోజున 46వ డివిజన్ కాకర్ల వారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నూతనంగా తీసుకోవడానికి, రెన్యూవల్ చేసుకోవడానికి గడువు ముగుస్తోందని, ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వాలంటీరుకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏ ఒక్క కార్యకర్తని కూడా విస్మరించమని, రాత్రి పగలు తేడా లేకుండా వారికి ఏ సమయంలో ఏ అవసరం పడినా తోడుగా ఉంటూ అండగా నిలుస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చేసుకొనే మన యజ్ఞానికి ప్రజలందరి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయని, రాష్ట్రానికి కాబోయే సీఎం పవనన్నే అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com