Logo
Date of Publish : 08 September 2022, 3:23 am
Editor : Sake Naresh

అంబరీష్ కుటుంబానికి అండగా ఉంటాం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి

     ధర్మవరం, (జనస్వరం) :  ధర్మవరం పట్టణానికి చెందిన జనసేనపార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింక అంబరీష్ ప్రమాదవశాత్తు మంగళవారం బత్తలపల్లి మండలం సంగమేశ్వరం దగ్గర ఉన్న చిత్రావతి నదిలో పడి మరణించడం జరిగింది. జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి బుధవారం జింక అంబరీష్ మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ వైద్యశాల మార్చురీ గది నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా వారి ఇంటి దగ్గరకు చేర్చారు. అనంతరం చిలకం మధుసూదన రెడ్డి దంపతులు జింక అంబరీష్ మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జింక అంబరీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. అంబరీష్ కుటుంబ సభ్యులకు జనసేనపార్టీ తరఫున అండగా ఉండి అన్ని రకాలుగా వారిని ఆదుకుంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు అంబరీష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com