Logo
Date of Publish : 19 January 2024, 10:43 pm
Editor : Sake Naresh

సుదీర్ఘ కాలంగా ఉన్న పావురాల గుట్ట ఇళ్ల పట్టల సమస్యను పరిష్కరిస్తాం

   అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 9వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గప్రజలు నివాసముండే పావురాల గుట్ట కాలనీని సందర్శించి అక్కడ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చిన పలు సమస్యనుగురించి మాట్లాడుతూ ఈ కాలనిలోదాదపు 500కుటుంబాలు నివాసం ఉంటున్నాయని సుదీర్ఘ కాలంగా వీరు ఇక్కడ జీవిస్తున్న వీరికి ప్రభుత్వం ఇప్పటికీ ఇల్లపట్టలు మంజూరు చేయలేదని అన్నారు. ఈ సమస్య వల్ల వీరికి స్థానికంగా పాటశాలలు, నీటి సదుపాయం, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలకు లోనవుతున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం వీరికి త్వరితగతిన ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనియెడల రాబోయే సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వ స్థాపన తర్వాత వీరికి పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఈ కాలనిని అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com