అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 9వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గప్రజలు నివాసముండే పావురాల గుట్ట కాలనీని సందర్శించి అక్కడ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చిన పలు సమస్యనుగురించి మాట్లాడుతూ ఈ కాలనిలోదాదపు 500కుటుంబాలు నివాసం ఉంటున్నాయని సుదీర్ఘ కాలంగా వీరు ఇక్కడ జీవిస్తున్న వీరికి ప్రభుత్వం ఇప్పటికీ ఇల్లపట్టలు మంజూరు చేయలేదని అన్నారు. ఈ సమస్య వల్ల వీరికి స్థానికంగా పాటశాలలు, నీటి సదుపాయం, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలకు లోనవుతున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం వీరికి త్వరితగతిన ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనియెడల రాబోయే సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వ స్థాపన తర్వాత వీరికి పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఈ కాలనిని అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com