సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం వంతెనను ఆదివారం పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి దామోదరం సంజీవయ్య మూడవ గ్రిడ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఒకసారి 11 కోట్లుతో హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పారు. అయిపోయింది మళ్లీ రెండుసార్లు హై లెవెల్ వంతెన నిర్మాణం ఎప్పుడు అని చెప్పి జనసేన పార్టీ నుంచి వినిపించినప్పుడు 13 కోట్లతో వంతెన నిర్మాణం చేస్తున్నామని సర్వే జరుగుతుంది. లోతు చూస్తున్నాం, వెడల్పు చూస్తున్నాం, లావు చూస్తున్నాం, పొడుగు చూస్తున్నాం అని చెప్పి మాటల గారేడు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సూటిగా సుత్తి లేకుండా ఒకటే ప్రశ్న వేస్తున్న 13 కోట్ల రూపాయలతో హై లెవెల్ వంతెన నిర్మాణం చేయడానికి ఐదు సంవత్సరాలు కాలం మీకు సరిపోలేదా ఇదేనా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి అంటే దీనికి మీరు సమాధానం చెప్పండి. మీకు ఎందుకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లు వెయ్యాల మాటల గారడి చేసి మసిబూసి మారేడు కాయ ఎన్ని రోజులు చేస్తారు. ఈసారి డిపాజిట్లు కూడా లేకుండా మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు సిద్ధం వున్నారు. తిరుమలమ్మపాలెంలో ఒక్క ఓటు కూడా పడకుండా మీకు సున్నా చుట్టడం చూస్తారు. మీకు తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా మీలాంటి వ్యక్తిని రెండుసార్లు ఓట్లేసి గెలిపించినందుకు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలే సిగ్గుపడుతున్నారు. ఇంకా చాలు కాకాని గోవర్ధన్ రెడ్డి సేవలు సర్వేపల్లి నియోజకవర్గానికి రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని విజయవంతంగా గెలిపించి కలగా మిగిలిపోయిన తిరుమలమ్మపాలెం గ్రామానికి హైలెవలు వంతెన నిర్మాణం చేసి చూపిస్తాం. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణిభవాని, జనసేన పార్టీ వెంకటాచలం మండల కార్యదర్శి సందూరు శ్రీహరి, సీనియర్ నాయకులు రహీమ్, అక్బర్, సుమన్, మస్తానయ్య, విజయ్, శరత్, హరి, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com