నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 289వ రోజున 46వ డివిజన్ పణతుల వారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వస్త్ర వ్యాపారం పై ఆధారపడ్డ అనేక కుటుంబాలు ఉన్నాయని అన్నారు. కోవిడ్ సమయంలో ఏర్పడిన సంక్షోభం నేటికీ అనేక కుటుంబాలను పట్టి పీడిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎటువంటి సాయం చేయకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని లాక్కొచ్చే వారే ఎక్కువుగా ఉన్నారని అన్నారు. కార్పొరేట్ వస్త్ర దుకాణాలు పెరిగిపోవడం వీరి ఉనికికే ప్రమాదంగా మారిందని అన్నారు. కాలానుగుణంగా మారుతున్న ట్రెండ్ లకు తగ్గట్లు వీరు నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం ఋణ సాయం చేయాలని, కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే పనిలో, అమ్మే పనిలో ఉంది తప్పించి వ్యాపారస్తులకు బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించే పరిస్థితులో లేదని అన్నారు. నెల్లూరు నగరంలో ఇలాంటి వ్యాపారులందరూ పడుతున్న కష్టాలను తాను పవనన్న ప్రజాబాటలో కళ్ళారా చూస్తున్నానని, ప్రతి ఒక్కరి సమస్యను వింటున్నానని, ప్రజలందరి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీలో గెలిచేది తామేనని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.