సత్తెనపల్లి ( జనస్వరం ) : రాజుపాలెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు, తోట నర్సయ్య గారి, ఆహ్వానం మేరకుమొక్కపాడు గ్రామంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు గారి చేతుల మీదుగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఇంటింటికి పవనన్న బాట కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మొక్కపాడు గ్రామ జనసైనికులు జనసేన పార్టీ నాయకులకు, అప్పారావు గారికి ఘనంగా స్వాగతం పలికారు. మొదటిగా గ్రామంలో ఇంటింటికి పవనన్న బాట కార్యక్రమాన్ని నిర్వహించి, తరువాత జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అనంతరం బొర్రా వెంకట్ అప్పారావు గారు మాట్లాడుతూ రాబోయేది జనసేన ప్రభుత్వం అని, జనసేన పార్టీ రోజురోజుకీ బలపడుతుందని, అందుకు గ్రామ గ్రామాన ఎగురుతున్న జనసేన పార్టీ జెండాలు నిదర్శనమని తెలియజేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారి ప్రారంభించబోయే 3వ దశ వారాహి యాత్రతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయని, గత రెండు రోజుల నుండి జగనన్న కాలనీలను సందర్శించడం జరిగిందని రాబోయే జనసేన ప్రభుత్వం ద్వారా ప్రజారంజక పరిపాలన అందిస్తామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన రాజుపాలెం మండల నాయకులను, మొక్కపాడు గ్రామ నాయకులను జన సైనికులను అభినందించారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉండి జనసేన పార్టీ అభివృద్ధి కృషి చేయాలని తెలియజేశారు. జనసేన పార్టీలో మొక్కపాడు గ్రామంలో జనసేన పార్టీలోకి జాయినింగ్ కార్యక్రమం జరిగినది, అదేవిధంగా, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం, కిట్లు కూడా బొర్రా వెంకట అప్పారావు గారు.చేతుల మీదగా మండల అధ్యక్షుడు, చేతుల మీదుగా ఇవ్వటం, జరిగింది. నాలుగు మండలాల అధ్యక్షులు, తోట నర్సయ్య గారు. రాజుపాలెం మండల అధ్యక్షులు, ముప్పాల మండల అధ్యక్షులు సిరిగిరి పవన్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు, నాగేశ్వరావు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి ఏడవ కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ నెంబర్ బత్తుల కేశవ , సత్తెనపల్లి నియోజకవర్గ వీర మహిళ, నామాల పుష్పలత, రాజుపాలెం మండల ప్రధాన కార్యదర్శి, కేదారి రమేష్, రాజుపాలెం ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సంయుక్త కార్యదర్శు, గలబా నాగేశ్వరావు. పసుపులేటి వెంకటేశ్వర్లు, పర్మి శ్రీనివాసరావు, మొక్కపాడు గ్రామ అధ్యక్షులు, పోకల శ్రీను, రాజుపాలెం గ్రామ అధ్యక్షులు కోటేశ్వర, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, బీరవెల్లిపాయి, గ్రామ అధ్యక్షులు గరట వెంకట శివ , అంచుల వారి పాలెం ఉపాధ్యక్షులు. కోటేశ్వరరావు, గోపి,జనసైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, సత్తెనపల్లి వార్డు కౌన్సిలర్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు, నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ వారు, గ్రామ కమిటీ వారు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగినది...
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com