Search
Close this search box.
Search
Close this search box.

సుబేదారుపేట వ్యాపారస్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 84వ రోజున 51వ డివిజన్ స్థానిక సుబేదారుపేటలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు..ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వివిధ వృత్తి పనుల వ్యాపారాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో కాలువల్లో నుండి మురుగు తీయకపోవడం ఇబ్బందిగా మారిందని, అది పలు వ్యాపారులపై ప్రతికూలంగా ఏర్పడిందని అన్నారు. ఎప్పటికప్పుడు పన్నులు కట్టించుకునే నగరపాలక సంస్థ పనితీరు అధ్వాన్నంగా ఉందని అన్నారు. జనసేన పార్టీకి అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో పరిస్థితులను వ్యాపారస్తులకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా అనేక వ్యాపారాలకు రుణాలిచ్చి ప్రోత్సహిస్తామని, ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way