Logo
Date of Publish : 31 July 2022, 2:47 am
Editor : Sake Naresh

ప్రతి డివిజన్ కు సంబంధించిన జనసేనపార్టీ మ్యానిఫెస్టోలను తయారుచేస్తాం

- నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులతో 75 రోజులుగా పవనన్న ప్రజాబాట
- ప్రజల ఆదరణ మరువలేనిదన్న జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 75వ రోజుకి చేరింది. 75వ రోజున 40వ డివిజన్ మూలాపేటలోని కోనేటిమిట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత 75 రోజులుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాటని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో సమస్యలు కనిపిస్తున్నాయని, నెల్లూరు సిటీలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సమస్య ఉందని, పవనన్న ప్రజాబాట ద్వారా ప్రతి అంశాన్ని అధ్యయనం చేసే అవకాశం తనకు కలిగిందన్నారు. తాము అధ్యయనం చేసిన ప్రతి సమస్యకు పరిష్కారమార్గం చూపేలా ప్రతి డివిజన్ కి సంబంధించిన మ్యానిఫెస్టోలను రూపొందించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగుతాం అని అన్నారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన జెండాని రెపరెపలాడిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com