
అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధినేత శ్రీ.పవన్ కళ్యాణ్ దృష్టికి బోయ వాల్మీకుల సమస్యలను తీసుకెళ్లి… వారి అభ్యున్నతికి బాటలు వేస్తామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు TC వరుణ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని పలువురు వాల్మీకి సంఘం నాయకులు, జనసేన వాల్మీకి ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షులు శ్రీ TC.వరుణ్ ను పార్టీ కార్యాలయంలో కలిశారు. వాల్మీకి బోయలు ఎదుర్కొంటున్న సమస్యలను వరుణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా TC వరుణ్ మాట్లాడుతూ… రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో బోయ వాల్మీకులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారి స్థితిగతుల గురించి తనకు అవగాహన ఉందని, కుల వృత్తి లేని వారు అభివృద్ధి చెందాలంటే పాలకులకు ఎంతో చిత్తశుద్ధి కావాలన్నారు. గతంలో అధికారంలో ఉన్న టిడిపి కావచ్చు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి కావచ్చు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని… క్షేత్రస్థాయిలో వారి అభ్యున్నతికి మాత్రం పాటుపడ లేదన్నది నిష్టూర సత్యమన్నారు. వాల్మీకి బోయలు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి వారి అభివృద్ధికి, విద్య, వైద్య సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో పురోభివృద్ధికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించి వాల్మీకి బోయ సామాజికవర్గానికి జనసేన అండగా నిలుస్తుందని జిల్లా అధ్యక్షులు TC.వరుణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, కార్యదర్శి జయమ్మ , సంయుక్త కార్యదర్శి శివ, చంద్ర శేఖర్, రమేష్, నదిమిదొడ్డి శివయ్య, చంద్రశేఖర్, T.గోపాల్, దేవేంద్ర, సురేష్, అజయ్, అమర్, ప్రతాప్, D.హరీష్, తదితరులు పాల్గొన్నారు.