Logo
Date of Publish : 01 July 2023, 5:08 pm
Editor : Sake Naresh

వైసీపీని గద్దె దింపుతాం.. అనంతలో జనసేన జెండా ఎగురవేస్తాం

            అనంతపురం ( జనస్వరం ) : గత నాలుగున్నర సంవత్సర కాలంలో అధికార వైసిపి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ... జనసేన అధికారంలోకి వస్తే జరగబోయే మేలును వివరిస్తూ ఈనెల 9వ తేదీ నుండి జనసేన జయభేరి కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్లు జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ టీ.సీ.వరుణ్ గారు తెలిపారు. శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్ లోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరుణ్ గారు మాట్లాడారు. జనసేన జయభేరి కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 50 డివిజన్లు, నాలుగు పంచాయతీలలో విస్తృతంగా పర్యటిస్తామన్నారు. స్థానిక నాయకులను సమన్వయం చేసుకొని.. స్థానిక ప్రజలతో మమేకం అవడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో ఇచ్చే హామీలకు విస్తృత స్థాయిలో ప్రచార కల్పిస్తూ.. జనసేన పార్టీని ఆదరించి, అధినేత  పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. వైసిపి అధికారంలోకి రాకముందు అనంత నగర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో నాయకులను నిలదీస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను వైసిపి పార్టీ కార్యకర్తలకు మాత్రమే పరిమితం చేసిన అన్యాయాన్ని ఎదిరించి.. స్థానిక సమస్యలపై సమరభేరి ముగిస్తూ జనవాణి వినిపిస్తామన్నారు. జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వైసిపిని గద్దె దింపుతాం.. ముమ్మాటికి అనంతలో జనసేన జెండా ఎగురవేస్తామని శ్రీ టి.సి.వరుణ్ గారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు  పొదిలి బాబురావు, కార్యక్రమాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుమ్మర నాగేంద్ర, కార్యదర్శిలు రాపా ధనుంజయ్, సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, జయమ్మ, నగర ఉపాధ్యక్షులు  సదానందం, గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, రోళ్ళ భాస్కర్, వెంకటనారాయణ, హుస్సేన్, దరాజ్ భాషా, కార్యదర్శులు జక్కిరెడ్డి పద్మావతి, సువర్ణమ్మ, లాల్ స్వామి,మురళి, విశ్వనాధ్, శేషాద్రి,  సంపత్, వెంకటేష్, వెంకటరమణ, ఆకుల ప్రసాద్, ఆకుల అశోక్ మరియు వీరమహిళలు అనసూయ, నాయకులు హిద్దు, జయకృష్ణ, sku రమణ, మధు, నవీన్, నౌషాద్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com