
రామచంద్రపురం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్య లపై ఉద్యమించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పటాన్ చెరువు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ యడమ రాజేష్ తెలిపారు. రామచంద్రాపురంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గం, జిహెచ్‌ఎంసి, మున్సిపాలిటీ, గ్రామస్థాయిలో జనసేన కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తామని తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరుస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందుతున్నాయని తెలిపారు. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటిపై ఉద్యమించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో జనసేన పార్టీని ఒక శక్తివంతంగా తయారు చేస్తామని తెలిపారు. నాయకులు చంద్రకాంత్, శ్రీకాంత్, శ్రీరామ్, మనోహర, మహేష్, లక్ష్మణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.