
గంగాధర్ నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు మహానుభావులైన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల చక్కని మైత్రి బంధంతో సరికొత్త ప్రజా ప్రభుత్వం 2024 లో ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కూడా జనసేన టిడిపి సంయుక్తంగా కార్వేటి నగరం మండలాన్ని మహానగరం చేసి చూపిస్తామని తెలిపారు. ఒకప్పుడు రాజులు ఏలిన నగరాన్ని రాజనగరం చేస్తామని తెలిపారు. చారిత్రాత్మక నగరంగా తీర్చిదిద్దుతామని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే కార్వేటి నగరం మండలంలో 50 బూత్ లో 50 గ్రామాలను మొదటి సంవత్సరంలోని ఆదర్శ గ్రామాలుగా తయారు చేస్తామని తెలియజేశారు. అన్ని అంగులతో సర్వరంగ సమగ్ర అభివృద్ధిని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు విజయ్, సెల్వి, కార్వేటి నగర్ సీనియర్ నాయకులు శేఖర్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, కార్వేటినగరం మండల కాపు యువసేన అధ్యక్షులు వెంకటేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గం కార్యదర్శి అన్నామలై, గంగాధర్ మండల ఉపాధ్యక్షులు వెంకటాద్రి, జిల్లా సంయుక్త కార్యదర్సులు రాఘవ, నరేష్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చామంతి సురేష్, కార్వేటి నగర్ మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, కార్వేటినగరం మండల కార్యదర్శి దేవా, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి హరీష్, నియోజకవర్గ కార్యదర్శి సతీష్, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, పాలసముద్రం మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కార్వేటినగరం టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు మనోహర్, నియోజకవర్గ కార్యదర్శి కోదండన్, వెదురు కుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, గంగాధర నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు రషీద్, జనసేన నాయకులు పాల్గొన్నారు.