Logo
Date of Publish : 14 December 2023, 10:03 pm
Editor : Sake Naresh

పెనుమూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం

     గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : పెనుమూరు మండలం, ఏనుగు కొండయ్య పల్లి గ్రామంలో జనసేన ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి Dr యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ప్రారంభ మహోత్సవానికి ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. వెంటనే జనం కోసం జనసేన ( భవిష్యత్తు గ్యారెంటీ ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు పెనుమూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేసారు. మొదటి సంవత్సరంలోనే 40 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. ఒకసారి జనసేన తెలుగుదేశానికి అవకాశం ఇవ్వండని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏనుగు కొండయ్య పల్లి గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీలోని అజెండాను ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాల ద్వారా తెలియజేశారు. కలివిడిగా ప్రజలతో మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాథం నాయుడు, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి భాను ప్రసాద్, పెనుమూరు మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, మండల కార్యదర్శి శేఖర్, మండల యువజన అధ్యక్షులు గురు ప్రసాద్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com