వేమూరు ( జనస్వరం ) : ఆవుల వారిపాలెం, పెసర్లంక, సుగ్గునలంక మరియు చిలుమూరులంక గ్రామాలలో అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, పసుపు, అరటి తోటలను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పరిశీలించి రైతులను పరామర్శించటం జరిగినది. ఈ సందర్భంగ గాదె మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు మొక్కజొన్న క్వింటాకు రూపాయలు 1960/- పసుపు క్వింటాకు రూపాయలు 7000/- అరటి తోటలకు ఎకరాకు రూపాయలు 30000/- లు ఇవ్వాలని డిమాండ్ చేయటం జరిగినది. లేని పక్షంలో తాడికొండలోని సిఎం క్యాంప్ ఆఫీస్ ముందు రైతులతో ధర్నా చేస్తామని హెచ్చరించటం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా నాయకులు నారదాసు ప్రసాద్, సోమరౌతు అనురాధ, నెల్లూరు రాజేష్, కొల్లూరు మండల అధ్యక్షులు బొందలపాటి చలమయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఈమని మణికంఠ, కార్యదర్శులు రావూరి పాండురంగారావు, సుగ్గున శంకరావు, యెర్రు హరిబాబు, సనకా గోపి, నాగ సురేష్, నాగరాజు, కోన పోతురాజు మరియు బాలాజీ, పెసర్లంక ఎంపిటిసి శివ సుబ్రహ్మణ్యం, చావలి ఎంపిటిసి నగేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com