ఉప్పల్ ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి సభ్యత్వ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా చేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలోనూ ముందుంచడానికి పని చేసిన వాలంటీర్లకు చిరు సత్కారం చేసి గౌరవించడం జరిగింది. ఇంటిటి ప్రచారం కోసం కరపత్రాలను, స్టికర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే ఎన్నికల కోసం ఉప్పల్ నియోజకవర్గ వర్కింగ్ కమిటీ ని నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగురేస్తామని, ఆ విధంగా కష్టపడదామని నిహారిక పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మీ సూచనలను, సలహాలను, అభిప్రాయాలను పంచుకున్న నియోజకవర్గ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు అందరికీ ధన్యవాదములు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com