శేరిలింగంపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం ఇంచార్జ్ Dr. మాధవరెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జనసేన 32 స్థానాల్లో పోటీ చేయనున్న విషయం మీడియా మిత్రులతో పంచుకోవడం జరిగింది. మాధవరెడ్డి గారు మాట్లాడుతూ జనసేన పోటీకి సిద్ధమని ప్రకటించిన 32 స్థానాల్లో శేరిలింగంపల్లి కూడా ఉండడం ఆనందకరం అని వ్యాఖ్యానించారు. ఇక ముందు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. శేరిలింగంపల్లిలో జనసేన జండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టోని మీడియా మిత్రుల ముందు ఉంచారు. మేనిఫెస్టో కి సంబంధించి పలు ప్రశ్నలకు మాధవ రెడ్డి గారు సహా జనసేన నాయకులు సమాధానాలు చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com