
రాజంపేట ( జనస్వరం ) : సిద్ధవటం మండలం ఖాజీ పల్లె, మాస్ పల్లె, లిగం పల్లె, కడపాయ పల్లె, టక్కోలి, డేగనపల్లె గ్రామంలో ఆదివారం రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ పర్యటించారు. పవనన్న ప్రజా బాట సందర్భంగా గడపగడప తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేశారని, ఒక రాజధానికి గతి లేదు కానీ మూడు రాజధానులు కడతామని నాలుగు సంవత్సరాలుగా కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వైసిపి ప్రజా ప్రతినిధుల మాటలు ఎవరూ నమ్మవద్దని ఏపీలో రోడ్ల పరిస్థితి చూస్తూ ఉంటే పక్క రాష్ట్రం వాళ్ళు నవ్వుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి లేని రాష్ట్రం ఏపీ రాష్ట్రమని కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతున్నాము అంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి పార్టీ ప్రజలపై అధిక పెనుబారాలు మోపారని అన్నారు. నిత్యవసర వస్తువులు కరెంట్ బిల్లులు, బస్ చార్జీలు పెట్రోల్ డీజలు పరీతంగా రేట్లు పెంచారని పవనన్న ప్రజా బాటలో కరపత్రాలు పంచుతూ ప్రజలకు తెలియజేశారు. జనసేన పార్టీలో భారీగా యువత జనసేన పార్టీలో చేరారు. శ్రీరామ్ నగర్ కాలనీ నందు ఉన్న కోదండరాముని ఆలయంలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా యువ నేత జగన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి, సిద్ధవటం సర్పంచ్ ప్రతినిధి ఓబులయ్య, ఉపసర్పంచ్ హీదాయత్ జిల్లా పరిషత్ చైర్మన్ మునిస్వామి, శ్రీనివాస్ రెడ్డి, ఎం నాగరాజా, ఎల్ శ్రీనివాసులు మైనార్టీ సోదరులు మహబూబ్ బాషా,, గౌస్ జనసేన పార్టీ వీర మహిళలు,జనసేన సైనికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.