రాజంపేట ( జనస్వరం ) : ఏమాత్రం పదిపైసలు అభివృద్ధి లేకుండా "సామాజికసాధికారత "పేరుతో చేస్తోంది బస్సు యాత్ర కాదు ఇది తుస్సు యాత్ర.. ఖచ్చితంగా దీనిని అడ్డుకుంటామని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. రైల్వే కోడూరు నియోజక వర్గం అన్ని విధాల వెనుకబడి అభవృద్ధి నోచుకోకుండా చేసి కనీసం నియోజకవర్గంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేకుండా చేసిన వైసీపీ పార్టీ సామాజిక సాధికారత పేరుతో యాత్ర చేసే అర్హత లేదని, ఖచ్చితంగా ఈ యాత్రను అడ్డుకుంటామని నాగేంద్ర తెలిపారు... నియోజక వర్గంలో ఎవరు సంతోషంగా ఉన్నారని 5మండలాలలో ఏ అభివృద్ధి చేశారని, యాత్ర చేస్తున్నారని నిలదీశారు అసలు సామాజిక సాధికారత అంటే ఏమిటి? నియోజక వర్గంలో 5 మండలాలలో ఏ అభివృద్ధి చేశారని యాత్ర..... Sc, st, బీసీ, ముస్లింమైనారిటి, ఒక్క ఉద్యోగమైన ఇచ్చారా ?? ముక్యంగా మంగంపేటలోని స్థానిక అవుట్ సోర్సింగ్ బాదితులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారా? రైతులకు పరిహారం ఇచ్చారా? నియోజక వర్గంలో ఎమ్మెల్యే ఒక్క కిలోమీటరు రోడ్డు వేసిన పాపానా పోయడా? అంగన్వాడీ, ఆశ వర్కర్ల సమస్యను గాలికొదిలిన మీకు యాత్ర చేసే హక్కు లేదని, కార్మిక, కర్షక లోకాలు ఎవరూ సంతోషంగా లేరని అందరిని, అన్ని వర్గాలను కలుపుకుని అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సర్పంచ్ సంయుక్త, పగడాల వెంకటేష్, నల్లంశెట్టి యానాదయ్య, గంధం శెట్టి దినకర్ బాబు,ముద్దపోలు రామసుబ్బయ్య, కనుపర్తి శంకరయ్య, ఆలం రమేష్, పగడాల చంద్ర శేఖర్,వరికూటి నాగరాజ, దాసరి వీరేంద్ర, బీదం నవీన్ కుమార్, కొక్కంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com