రాప్తాడు ( జనస్వరం ) : జనసేన పార్టీ రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసిపి పార్టీ సిద్ధం సభను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని హెచ్చరించారు. గతంలో జగన్ రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో బెంగళూరుకు దగ్గర్లో ఉన్న APIAT పార్క్ ను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ హామీ ఎక్కడికి పోయింది. త్రాగునీరుకి సంబంధించి 80 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పిన ఆ హామీని ఏ తుంగలోకి తొక్కారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాలకు సంబంధించిన రిజర్వాయర్లను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పి రాప్తాడు కు సంబంధించిన అన్ని హామీలు నెరవేరుస్తున్నానని చెప్పారు. అవెక్కిడికి వెళ్ళయని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. వాటికి సంబంధించిన నిధులు విడుదలు చేశారా లేదా? ఒకవేళ విడుదల చేసి ఉంటే ప్రకాష్ రెడ్డి ఎంత కమిషన్ తీసుకున్నాడు అనేది ప్రభుత్వం ద్వారా శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతనే సిద్ధం సభ జరుపుకోవాలని లేదంటే ప్రజలతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిద్ధం సభను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాప్తాడు రూరల్ మండల్ కన్వీనర్ జి.వెంకటేష్ , సదాశివణ్, రమేష్, రామకృష్ణ, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com