పత్తికొండ ( జనస్వరం ) : జనసేన నాయకులు CG రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం భావితరాల భవిష్యత్తు కోసం… వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపితో పొత్తు ఉంటుంది అని తెలియజేయడాన్ని స్వాగతిస్తున్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉన్నామని గర్వంగా తెలియజేస్తున్నామని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టిడిపితో పొత్తు ఉంటుందని తెలియజేయగానే జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైసిపి పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు పంచలు తడిసిపోతున్నాయని అర్థమయిపోయింది. భయంతో అభద్రత భావంతో అసహనంతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అధికార మదమెక్కి తప్పుడు ఆరోపణలతో విమర్శిస్తున్నారో వారందరి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడితే బాగుంటుంది. మతిభ్రమించిన వైసిపి మంత్రులు ఏ రోజు వారి శాఖకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన పాపాన పోలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసి మీకు చాతనైతే దమ్ము ధైర్యం ఉంటే ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకొని వచ్చే ఎన్నికల్లో గెలచండి. నీతిమాలిన మాటలు మాట్లాడే వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేల లందరికీ ఇదే హెచ్చరిక వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మీకు పుట్టగతులు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకోండని అన్నారు.