
సర్వేపల్లి, (జనస్వరం) : వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఏదైతే కొత్త జిల్లాల ఏర్పాటు అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం గతంలో తిరుపతి పార్లమెంటులో ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పడబోయే బాలాజీ ( తిరుపతి ) జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం కలిపే విధంగా పునరాలోచన జరుగుతున్న తరుణంలో సెప్టెంబర్ 6 /2020లోనే మేము నెల్లూరు జిల్లా ముద్దు బాలాజీ జిల్లా వద్దు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ వాసి పెద్దలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చొరవతో సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంటే మరి అటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచితే నెల్లూరు జిల్లాకి ఎంతో ఉపయోగకరం ఉంటుంది. అదే సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలిపితే నెల్లూరు జిల్లాకి తీవ్ర నష్టం జరిగేటటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఆదాయం బాలాజీ జిల్లాకు పోతుంది బూడిద పొల్యూషన్ నెల్లూరు జిల్లాకు మిగులుతుంది వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మరియు వెంకయ్య నాయుడు గారి చొరవతో మా యొక్క విన్నపాన్ని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా తీసుకెళ్ళాం. దీంతో కేంద్రం పెద్దలు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం ఉండేలా చర్యలు తీసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచేందుకు ప్రత్యేక కృషి చేసిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ కమిటీ మెంబర్ పోలంరెడ్డి ఇందిరా రెడ్డి, సందీప్, వంశి, సాయి తదితరులు పాల్గొన్నారు.