
కదిరి, (జనస్వరం) : జిల్లాల పునర్విభజనలో భాగంగా కదిరి రెవెన్యూ డివిజన్ ను ఎత్తివేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆసమంజసమని, అన్యాయం అని కదిరిలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేయడం, ఆ క్రమంలో భాగంగా అందరికన్నా ముందు మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తరఫున కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దలు కొన్ని మార్పులు, చేర్పులతో కదిరి రెవెన్యూ డివిజన్ ను కదిరిలోనే కొనసాగించడానికి మళ్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఇక్కడి ప్రజలు సాధించుకున్న విజయంగా జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దీనికి సహకరించిన ప్రభుత్వ అధికారుల కు ప్రభుత్వ పెద్దలకు అందరికీ కదిరి జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాముని అన్నారు.