Logo
Date of Publish : 18 September 2023, 12:47 am
Editor : Sake Naresh

భవిష్యత్తు బాగుండాలని తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తాం

     సూళ్లూరుపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానుసారం సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ గారు తెలుగుదేశం పార్టీకి తన మద్దతు తెలియజేశారు. టిడిపి ఇంఛార్జి మాజీ పార్లమెంట్ సభ్యులు నెలవల సుబ్రమణ్యం గారిని నాయుడుపేటలోని వారి నివాసంలో DV సత్రం మండల ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి, తడ మండల ఉపాధ్యక్షులు సిరివేటి రమణ మరియు నాగరాజ్, ప్రధాన కార్యదర్శులు చేని ముని శేఖర్, మురళి కృష్ణ రెడ్డి, నెలబల్లి ఆనంద్, మణి, కాశి, అజిత్, బాలు, ప్రతాప్, నాగార్జున మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన జనసైనికులు కలిసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం టిడిపి కార్యకర్తలకు, నాయకులకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఈ వైసీపీ నియంత పాలన, అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే అందరూ కలిసి కట్టుగా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం సాధించడానికి కృషి చేస్తామని తెలియజేశారు. టిడిపి వారు కూడా జనసైనికులకు అండగా నిలవాలని సోమశేఖర్ కోరారు. కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నారని జనసైనికులతో నెలవల హర్షం వ్యక్తం చేశారు. అలాగే మద్దతు తెలియజేసిన జనసైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com