Logo
Date of Publish : 17 September 2023, 11:30 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : గౌతమ్ కుమార్

      అనంతపురం ( జనస్వరం ) : రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి, రానున్న ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షలు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ తెలిపారు. ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచక, అవినీతి పాలన అంతమొందించాలంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసి వ్యతిరేకత ఓటు చీలకుండా వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధఃపాతాళానికి వెల్లెట్టు చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహంతో కంగుతిన్న జగన్ రెడ్డి మరియు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి పైన చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. ఎటువంటి స్వార్థం లేకుండా, రాజకీయాలు చూడకుండా కష్ట కాలంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, టీడీపీ క్షేత్ర స్థాయి కార్యకర్తలకు బరోసా ఇచ్చే విధంగా ఉధార మనస్తత్వంతో పవన్ కళ్యాణ్ గారు నిలవడాన్ని చూసి ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలను, నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్ళి ఆయన నాయకత్వం ప్రజలకి అందించేలా పని చేస్తామని తెలిపారు.

     మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, MLC శివరాం రెడ్డి పవన్ కళ్యాణ్ గారిపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని తెలియజేశారు. ఉరవకొండ నియోజకవర్గం మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో శివరాం రెడ్డి గారు నిన్నటి రోజున అసలు కమిటీలు కూడా ఉన్నాయా మీకు అని అన్నారు కమిటీలు కాదు మండల అధ్యక్షులు మండల కమిటీలు నియోజవర్గ స్థాయి కమిటీలు పవన్ కళ్యాణ్ గారి ఏర్పాటు చేసి రెండు సం" అవుతుంది అని అది మీకు తెలియకపోతే తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ వజ్రకరూరు మండల అధ్యక్షుడు అచనాల కేశవ బెలుగుప్ప మండల అధ్యక్షుడు కాసంశెట్టి సుధీర్ జనసేన నాయకులు దేవేంద్ర, రాజేష్, రమేష్, హరి శంకర్ నాయక్, సూర్య నాయక్, కుమార్, మణికుమార్, రూపేష్, బోగేష్, ప్రియతమ, చందు కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com