నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు గునుకుల కిషోర్ పత్రికా ముఖంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఏమి ఉపయోగపడని ఒక అజ్ఞాని ఒక అహంకారి ఒక నోటి దూల, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వాడికి ఓటు వేసి గెలిపించుకున్నాం అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. అనిల్ కుమార్ నీ ఉచిత సలహాలు నిన్ను పక్కన పెట్టిన మీ పార్టీ నాయకులకు ఇచ్చుకోమని అన్నారు. అనిల్ కుమార్ అహంకార సభ అట్టర్ ఫ్లాప్ తో నెల్లూరులోనే కాదు రాష్ట్రం లో కూడా ఒక ఫూల్ అయ్యారని నెల్లూరులో ప్రజలు భావిస్తున్నారన్నారు. నిన్నటి నీ అహంకార సమావేశం పొలిటికల్ కేరీర్ సూసైడ్ లా ఉంది. అహంకార సభ, నీ సొంత డబ్బా సభ నెల్లూరు సిటీ సెంటర్ లో ఎలా పర్మిషన్ ఇచ్చారు. దీని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు.నీ సొంత డబ్బా ఏధైనా గ్రౌండ్ లో ఏ ఫంక్షన్ హాల్ లో పెట్టుకోవచ్చు కదా అన్నారు. మంత్రిగా ఉనపుడే నువ్వు నెల్లూరు కి చేసింది ఏమిలేదు గాని మాజీ మంత్రి అయిన తరువాత ఇపుడు చేస్తాను చూడండి, అంటే నమ్మటానికి ప్రజలు ఏం అమాయకులు కాదు. అనిల్ కుమార్ అహంకార, బల ప్రదర్శన సభ కాకాని గోవర్దన్ రెడ్డికి పోటీగా పెట్టి కనీసం ఒక్క మాట కూడా కాకాణి ని అనే ధైర్యం లేక పోయింది అని ప్రజలందరూ భావిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు మీద నోరు పారేసుకోవటం అదేదో గొప్పగా భావిస్తున్నావేమో, ప్రజలు నీ మాటలను చీదరిస్తున్నారు అని తెలుసుకోవాలి. అనిల్ అహంకార సభ కాకాని విజయోత్సవ సభ రెండూ ప్రజలకు దేనికి ఉపయోగపడని సభలే. ఈ వైసీపీ బాదుడే బాదుడు పాలన లో ప్రజలు పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్క మాట కు వైసిపి నాయకులకు ఓడిపోతాం అని భయం పట్టుకుంది. ఎలాగైనా ఈ స్ట్రాటజీని అడ్డుకోవాలి అని అనిల్ ఎదో పెద్ద లాజిక్ అనుకోని జనసేన పార్టీ ఎక్కవ సీట్లలో పోటీ చేయండి లేదా సింగిల్ గా పోటీచేయాలి లాంటి అతితెలివి మాటలు మాట్లాడుతున్నారు నీ చేత ఉచిత సలహాలు మీ వైసీపీ పార్టీలో నిన్న దూరంగా పెట్టి, నిన్ను పట్టించుకోని మీ నాయకులకు ఇచ్చుకో అన్నారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు గునుకుల కిషోర్, దుగ్గిసెట్టి సుజయ్ మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బాధిపూడి, మహిళ రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, కోవూరు నాయకులు శ్రీనివాసులరెడ్డి, నాయకులు గాదం సతీష్, వరకుమార్, భీమా, మస్తాన్, హేమచంద్ర, మహిళా నాయకులు సుకన్య, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com