
బొబ్బిలి ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ లో నెలకొంటున్న విపరీత పరిస్థితులకు వ్యతిరేకంగా, మన తెలుగు ప్రజల అభిలాష మేరకు, రాష్ర శ్రేయస్సు కోసం, ఈ అవినీతి వైసిపి పాలనను అంతమొందించడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా మరియు బొబ్బిలి నియోజకవర్గం నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులందరమూ ముక్తకంఠంతో స్వాగతిస్తున్నామని తెలిపారు. అధినేత సూచనల మేరకు రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, తెలుగుదేశం పార్టీతో కలసి జనసేన+టీడిపి ప్రజా ప్రభుత్వ స్థాపనే లక్ష్యంగా పని చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు మరియు మండల అధ్యక్షులు, వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.