అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం భగత్ సింగ్ కాలనీ యందు నివసించు జనసేన పార్టీ కార్యకర్త బండి శేఖర్ గారి రక్త సంబంధీకులు B.రాధా w/o B. శ్రీనివాసులు గారి ప్లాటు భూబకాసురులు కబ్జా చేశారని జనసేన నాయకులు వాసగిరి మణికంఠ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గుంతకల్ మండలం తిమ్మనచర్ల గ్రామంలో పొలం, 258-B సర్వే నంబర్ లో జరిగిన భూ కబ్జా పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి భూ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని మా కార్యకర్త కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేర్కొన్న సర్వే నంబర్ లోని ప్రభుత్వం వారు బాధితురాలు B.రాధా గారికి కేటాయించిన ఫ్లాట్లో గత కొన్ని సంవత్సరాలుగా రేకుల షెడ్డు వేసుకొని ఉన్నారు. అక్కడ జన జీవనం గడపడానికి అనుకూలంగా లేకపోవడం వలన ప్రస్తుతం పట్టణంలో బాడుగ ఇంటిలో ఉంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని స్థానికంగా ఉన్న భూబకాసురులు వారి రేకుల షెడ్డును ఆక్రమించుకుని లక్షల్లో విక్రయించడానికి పన్నాగం పొందారు. దానిని గమనించిన మా కార్యకర్త బండి శేఖర్ న్యాయ పోరాటం దిశగా స్థానికంగా ఉన్న నాయకులకు ఆయన మొర విన్నవించుకోగా ఎవరూ పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. కావున తనకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ఆ ప్రాంత స్థలానికి వెళ్లి నేను గమనిస్తే ఎంతోమందికి అన్యాయం జరుగుతోంది అని తెలుసుకున్నాను. ఈరోజు కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో వారికి జరిగిన అన్యాయం గురించి వినతిపత్రం అందజేసాము. దయచేసి ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సమగ్ర విచారణ జరిపించి ఒరిజినల్ పట్టా దారులకు న్యాయం చేయాలని ఇది వారి జీవన్మరణ సమస్యగా భావించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.