ఉరవకొండ ( జనస్వరం ) : రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి బస్సు యాత్ర పేరుతో ముందుకు వస్తుందని ఎస్టీ, ఎస్టీ బీసీలను, మైనార్టీ ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ఉన్నతమైన పదవులు మాత్రం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి నిధులు లేని కార్పొరేషన్ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇచ్చారని జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ గౌతమ్ కుమార్ మండ్డిపడ్డారు. ఉరవకొండ నియోజవర్గంలో ఈ ప్రభుత్వం సామాజిక న్యాయాత్ర పేరుతో బస్సుయాత్ర చేయడానికి కనీసం అర్హత కూడా లేదన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీలకు ఏమీ చేయని వైసీపీ ప్రభుత్వం నేరుగా ముందుకు రాలేక బస్సు యాత్ర పేరుతో రోడ్లపై వస్తుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి రోడ్లపైకి రావాలంటే పరదాలల మధ్య వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు ప్రజల మధ్య కొస్తే ఎక్కడెక్కడ ప్రజలు నిలదీశారు. ఈవైసీపి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనే పదానికి విలువ లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందని ఉపాధి అవకాశాలు లేక గ్రామీణ ప్రాంత కుటుంబాలన్నీ ఇతర రాష్ట్రాలకు వరుసలు పోతున్నారని తెలియచేశారు..వర్షాలు సరిగా లేక పంటలు ఎండిపోయి రైతుల ఆత్మహత్య శరణమని బాధపడుతూ ఉంటే వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయకుండా రాష్ట్రంలో షికారుకెళుతున్నట్టు వైసిపి నాయకులు మాత్రం వెళ్తున్నారాన్నరు. ప్రజలకు న్యాయం చేయాలని ఆదుకోలేని పక్షంలో ప్రజలే ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్తారని తెలిపారు. నిన్నటి రోజున సామాజిక న్యాయ బస్సుయాత్ర బస్సు యాత్రలలో కొద్ది మంది వైసిపి నాయకులు విలేకరుల మీద దాడి చేయడం సరి కాదన్నారు. ఈనాడు విలేఖరి ఎర్రి స్వామి, భీమప్ప ,మంజునాథ్ మరి ఫోటోగ్రాఫర్లు మీద ఉద్దేశాపూర్వకంగా నిన్నటి రోజున దాడి చేయడానికి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com