• కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు
తాడేపల్లిగూడెం, ఏప్రిల్12 (జనస్వరం) : సమాజంలో అత్యధికంగా ఉండే బీసీ లను జగన్ ఏ మార్చి రాజ్యాంగపరంగా వారికి రావలసిన వాటాను ఇవ్వకుండా మోసం చేశారని వారికి రాబోయే ప్రభుత్వం (కూటమి) ఆధ్వర్యంలో అండగా ఉంటామని కూటమి ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పెంటపాడు మండలం పడమర విప్పరులో శుక్రవారం రాత్రి బీసీల ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలతోపాటు అన్ని వర్గాల ప్రజలను జగన్ తన స్వార్ధ రాజకీయాల కోసం మోసం చేశారని అతని అరాచకాలకు రాష్ట్రం విచ్ఛిన్నమైందన్నారు. ఎల్ల తరబడి రోడ్లు గోతులు మయంగా ఉన్న గోతులను కూడా ఉర్చలేని అసమర్ధ సర్కారులను సాగనంపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.