Logo
Date of Publish : 28 November 2020, 12:14 pm
Editor : Sake Naresh

మంత్రాలయం మఠం భూములు ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం : జనసేన ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖగౌడ్

మంత్రాలయం మఠం భూములు ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం : జనసేన ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖగౌడ్

                  మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పై భక్తులు ఎంతో భక్తితో భూములు మఠం అభివృద్ధికి ఇస్తే వేలంపాటలో అమ్మడం ఏంటని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికార చైర్మన్ రేఖగౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సంధర్బంగా శనివారంరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో రేఖగౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలోని గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని పది గ్రామాల్లో ఉన్న మంత్రాలయం భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యడం, ఆస్తుల వేలాన్ని వెయ్యడం జనసేనపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. మంత్రలయంలోని రాఘవేంద్రస్వామి మఠంకు చెందిన 208.51 ఎకరాల భూములను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేలం ప్రకటన ఇవ్వడం దారుణమన్నారు. మతానికో విధానాన్ని అవలంభించేలా హిందూ ధర్మానికి చెందిన భూములను వేలం వేసే హక్కు ప్రభుత్వానికి లేదని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదాయశాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించి ఆస్తులను సంరక్షించాలే తప్ప అమ్ముకోవడానికి విలులేదన్నారు. గతంలో టీటీడీ ఆస్తుల విక్రయాన్ని సంబంధించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన వ్యతిరేకత మరిచిపోయారా అని గుర్తుచేశారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా వుండాల్సిన పాలకులు తామే యజమానులు అనుకోవద్దని అన్నారు. ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయశాఖా పాలకుల ఒత్తిళ్లకు తల్లోగ్గితేనే వేలం విక్రయం ప్రకటనలు వస్తాయని దాతలు ఇచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికి పెడితే మనోభావాలు డెబ్భతిన్న భక్తుల, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com