వరంగల్ ( జనస్వరం ) : జనసేన పార్టి జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా మంగపేట మండల ప్రాంతంలోని శనిగగుంట గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లులు కాలిపోయిన కుటుంబాలను పరామర్శించిన జనసేనపార్టీ నాయకులు. అనంతరం వారికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేసారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ మాట్లాడుతూ ఇంత విషాదకరమైన ఘటన జరగడం చాలా బాధాకరమని, రాష్ట ప్రభుత్వం స్పందించి వీరిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాన్నారు. ఎక్కడైతే వారు ఇల్లులు కాలిపోయాయో అదే స్థలంలో భాదితులకు పక్కా ఇల్లులు నిర్మించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు కొలిపాక ప్రశాంత్, సిద్ధం రవి, విద్యార్థి విభాగం కోర్డినేటర్స్ మాచర్ల రాజేష్, సోమిడి సురేష్, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి జన్ను ప్రవీణ్, వరంగల్ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ జెరిపోతుల సనత్ కుమార్, మంగపేట మండల నాయకులు అజయ్, నరేష్, కృష్ణ, శ్రీకాంత్, సాయి కిరణ్, సందీప్, సిద్ధూ, అరుణ్, సిహెచ్ శ్రీకాంత్, ఏటూరునాగారం మండల నాయకులు పవన్ కళ్యాణ్, శివ, పవన్, నవీన్, రమేష్ భూపాలపల్లి నియోజకవర్గం నాయకులు సిద్ధం గణేష్, సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.