– కాపులపై విషం చిమ్ముతున్న సీఎం జగన్
– వైసీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు జోగయ్యకి మద్దతు ఇవ్వకపోతే కాపు ద్రోహులే.
– ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి.
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ మాట్లాడుతూ హరి రామ జోగయ్య అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని, ఆ పది శాతంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని చేస్తున్న దీక్షకు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. 80 సంవత్సరాల వయసున్న జోగయ్య చేస్తున్న ఉద్యమానికి 50 సంవత్సరాల యువ ముఖ్యమంత్రి భయపడి ప్యాంట్లు తడుపుకుంటున్నారని, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈబీసీ రిజర్వేషన్లులో కాపులకు ఐదు శాతం అమలు చేయాలని అసెంబ్లీలో అంగీకరించి కేంద్రానికి పంపారని, కానీ నేడు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదో జగన్ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణ పేదలతో పాటు కాపు సోదరులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పదేపదే కాపు సామాజిక వర్గంపై విషo చిమ్ముతున్నారని, ఎందుకో వారి పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. కిర్లంపూడి పాదయాత్రలో కూడా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని ప్రకటించారని, వైసీపీలో ఉన్న కాపు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నాయకులు జోగయ్య దీక్షకు మద్దతు ఇవ్వకపోతే చరిత్రలో కాపు ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వెన్నా శివశంకర్, బొబ్బూరి కొండలరావు, పులిచేరి రమేష్, బైపు. రామకృష్ణ, నోచర్ల పవన్ కళ్యాణ్, పొట్నురి
శ్రీనివాసరావు, బొట్ట సాయికుమార్, తమ్మిన రఘు, దాసిన.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.