అనంతపురం ( జనస్వరం ) : కర్నూలులో ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడిని కదిరి జనసేనపార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఇంచార్జీ భైరవ ప్రసాద్ పత్రిక సమావేశం లో అన్నారు. గతరెండు నెలలక్రితం గోరంట్ల విలేకరి ఈశ్వర్ పై దాడి చేయడం, మొన్న రాప్తాడు స్వయాన ముఖ్యమంత్రి గారి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి మరువకముందే నిన్నటి దినం ఈనాడు కార్యలయం పై దాడి దేనికి సంకేతమో ముఖ్యమంత్రి గారే చెప్పాలని అన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే పత్రికల పై, విలేకరుల పై దాడులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, మళ్లీ అధికారం లోకి రావడానికి అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు. ఇవి ఎన్నిరోజులు కొనసాగవని తొందరలోనే ఇంటికి పంపుతారని, రాష్ట్రంలో ఇంత దారుణంగా పత్రికలపై, విలేకరులపై దాడులు జరుగుతున్న ఓక పత్రిక అధిపతిగా ఉండి ఖండించక పోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామనీ, ఇది ఇలాగే కొనసాగితే వైసీపీ పార్టీనీ బంగాళాఖాతంలో కలిపెస్తారని తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ అధ్యక్షులు చలపతి, నల్లచెరువు మండల కన్వనర్ రవికుమార్, టౌన్ ప్రధా నకార్యదర్శి కిన్నెర మహేష్, న్యాయవాది రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com