Logo
Date of Publish : 30 December 2023, 10:04 pm
Editor : Sake Naresh

పెరిగిన ధరలతో జీవనం సాగించలేకపోతున్నాం

     ఒంగోలు ( జనస్వరం ) : అనిల్ కుమార్ కటకం శెట్టి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 75వ రోజు జనచైతన్య యాత్ర లో భాగంగా ఒంగోలులోని 12వ డివిజన్ లో మరాఠీ పాలెం లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజానీకం జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన ధరలతో మేము జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని అన్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ కుటుంబ పోషణ ఖర్చు మాత్రం పెరిగిందని, ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని మాకు ఎవరూ చేసింది ఏమీ లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పిన విధానం మమ్మల్ని బాగా ఆలోచింప చేసిందని అలాంటి నాయకుడికి ఈసారి అండగా నిలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత అభివృద్ధికి కచ్చితంగా పాటుపడతామని, కీలకమైన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అలానే 75 రోజులు సందర్భంగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, సుధాకర్ చంగళశెట్టి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, మరియు జనసేన నాయకులు సుధాకర్ పసుపులేటి, మహేష్ జగితపి, గల గల పవన్, రాఘవ చంగళశెట్టి, చెన్ను నరేష్, నరసింహారావు, కొట్ర సాయి, రవీంద్ర, కోర శశి కుమార్, జనసేవ శ్రీనివాస్, యాదల సుధీర్, బన్నీ, అవినాష్ పర్చూరి, పాండి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com