
ప్రకాశం ( జనస్వరం ) : స్థానిక నాయకులు భాను ప్రకాష్, మని గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 50వ రోజు జనచైతన్య యాత్ర లో భాగంగా ఒంగోలులోని 27వ డివిజన్ లో రాజపానగల్ రోడ్ 1-6 లైన్ లలో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజానీకం జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన ధరలతో మేము జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని,ప్రజల ఆదాయం పెరగలేదు కానీ కుటుంబ పోషణ ఖర్చు మాత్రం పెరిగిందని, ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని మాకు ఎవరూ చేసింది ఏమీ లేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పిన విధానం మమ్మల్ని బాగా ఆలోచింప చేసిందని అలాంటి నాయకుడికి ఈసారి అండగా నిలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మన ప్రాంత అభివృద్ధికి కచ్చితంగా పాటుపడతామని,కీలకమైన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అలానే 50 రోజులు పూర్తి ఐన సందర్భంగా జనసైనికులు సమక్షంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చడం జరిగింది,ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు,కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్,పల్ల ప్రమీల,ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు మనోజ్ రాయల్, గోవింద్ కోమలి,సుధాకర్ చంగళశెట్టి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పోకల హనుమంతు రావు,ఆకుపాటి ఉష,షేక్ సుభాని,28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, 3వ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్,మరియు వీర మహిళలు మాదాసు సాయి నాయుడు,సుంకర కళ్యాణి జనసేన నాయకులు మస్తాన్ రావు,బండారు సురేష్,జనసేవ శ్రీనివాస్, పవన్ గల గల, రాఘవ చంగళశెట్టి, చెన్ను నరేష్, నరసింహారావు, అనుదీప్, శ్రీపాద సాయి, మనోజ్ నాయుడు, ఉంగరాల వాసు, యాదల సుధీర్, చంద్ర, వసంత్ రాయుడు, శ్రీ సాయి, భరత్, సాయి తేజ, బాల కృష్ణ, అఖిల్, సూదిక్, సంజయ్, వెంకీ నాయుడు, సుమంత్, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు.