- సీఎం జగన్ పాలనలో సామాన్యుల జీవితాలు అతలాకుతలం
- యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
విజయవాడ, (జనస్వరం) : యువశక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రచార కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో రెండవ రోజు సోమీ గోవింద్, రెడ్డిపల్లి గంగాధర్ల ఆధ్వర్యంలో వించిపేట సిఎస్ఐ చర్చ్ సెంటర్ వద్ద ప్రారంభమై, రామాలయం కొండ ప్రాంతం, అబ్దుల్ ఖాదర్ వీధి, మహాలక్ష్మి గుడి వీధి ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతున్న సందర్భంలో స్థానిక ప్రజలు మహేష్ వద్ద అనేక సమస్యలను ప్రస్తావించినారు నెలకు ఇచ్చే పెన్షన్లు నుండి చెత్త పన్నును మినహాయించే వాలంటీర్లు ఇస్తున్నారని ఇంత కన్నా దారుణం ఏముందని, అనేకమంది పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులు నేటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని, కార్పొరేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మా సమస్య పరిష్కారం కావడం లేదని, కొన్ని సందర్భాల్లో తినడానికి కూడా తిండి ఉండడం లేదని, ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పాలవుతున్నారని అనేకమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, కరెంటు బిల్లులు కట్టలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని, జగన్ పాలనలో సామాన్యులు బతకలేరని ఒక్క అవకాశం ఇచ్చి పెద్ద పొరపాటు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి సంక్షేమం కేవలం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని, రాష్ట్రంలో అరాచక పాలన పోయి అభివృద్ధి సంక్షేమ పాలన రావాలంటే పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని, యువశక్తి కార్యక్రమం తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు రాక సేవారంగం కనీస స్థాయిలో కూడా విస్తరించకపోవడం వలన రాష్ట్రంలో యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని యువత భవిష్యత్తు బంగారమయం కావాలన్నా రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు రావాలన్నా వలసలు ఆగాలన్న అది కేవలం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పల్లంటి.అది, బంగారు.శ్రీనివాస్, చొక్కాకుల.కిషోర్, బౌరిశెట్టి.అర్జున్ కుమార్, తుపాకుల.చిన్న బాబు, వద్దది.రామకృష్ణ, సయ్యద్ ముబీనా, మల్లెపు విజయలక్ష్మి, పొట్నూరి శ్రీనివాసరావు, ఏలూరు సాయి శరత్, ఆకుల రవిశంకర్, ముద్దాన స్టాలిన్ శంకర్, బొమ్ము రాంబాబు, కొరగంజి వెంకటరమణ, వేవిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com