Logo
Date of Publish : 09 March 2023, 3:26 pm
Editor : Sake Naresh

పేదల ఇళ్ళకు అండగా నిలబడింది మేమే : పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

          నెల్లూరు సిటీ ( జనస్వరం ) :  జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 297వ రోజున 16వ డివిజన్ గుర్రాలమడుగుసంగంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నాలుగు కాలువల బినామీ కాంట్రాక్టుల కోసం వందలాది పేదల ఇళ్ళను కూలగొట్టే చర్యలకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పూనుకుంటే ఈ ప్రాంతంలో సర్వేపల్లి కాలువను ఆనుకుని ఉన్న పేదల నివాసాలు కూలకుండా హైకోర్టుకి వెళ్ళి ఆపింది తామేనని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ఇక్కడ అనేకమంది పేదలకు నిత్యావసరాలు అందించిన విషయాన్ని స్థానికులు గుర్తుచేయగా, పేదలకు తాము ఎప్పుడూ అండగా నిలుస్తామని కేతంరెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని, పవనన్నని ముఖ్యమంత్రి చేసుకుందామని కేతంరెడ్డి కోరారు. పవనన్న ప్రభుత్వంలో నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com