రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి అండగా ఉంటాము.
విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు సుమారుగా 33 వేల ఎకరాలకు పైగా భూములు ఇవ్వటం జరిగింది. మరీ ఆ రోజున రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఓ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ప్రభుత్వంలో వున్నవారు ఐదేళ్ళకోసారి మారొచ్చు. అలా మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ పోతామంటే ఎలా? రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. ఈరోజున కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతున్నాము. ఆరోజున అమరావతికి మద్దతుగా ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన వైఎస్ జగన్, అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. మరిప్పుడు ఎందుకు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారు అని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున ఆయన పత్రిక ముఖంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ 2015 నుంచి మేము జనసేన పార్టీ మా అధ్యక్షుల వారు ఎప్పుడూ రైతుల తరపునే మాట్లాడారు అని అప్పుడు టీడీపీ మనల్ని విమర్శించింది అని, ఆ తర్వాత కూడా ఇప్పటికి రైతుల తరుపున మాట్లాడుతున్నాము అని. ఇప్పుడు కూడా వైసీపీ మమల్ని విమర్శిస్తోంది అని, ప్రజలని మోసం చేయటంలో వైసీపీ, టీడీపీ రెండు ఒకటేనని, ప్రజా సమస్యల విషయంలో జనసేనకు మాత్రమే చిత్తశుద్ధి వుంది అని అందుకే, కష్టమొచ్చినప్పుడు జనసేన తలుపు తడుతున్నారు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతు కంటతడి పెడితే అది రాష్ట్రానికి మంచిది కాదు అని మూడు రాజధానుల పేరుతో అటు ఉత్తరాంధ్రనీ, ఇటు రాయలసీమనీ మభ్యపెట్టొద్దు అని ఇది విభజన రాజకీయాలకు దారి తీస్తుంది అని ఆయన తెలిపారు. మేం టీడీపీకి అలాగే వైసీపీకి సమదూరం పాటిస్తున్నాం అని, ప్రజల తరఫున ఈ రెండు పార్టీలతో రాజకీయ పోరాటం చేస్తున్నాం అని, ఎన్నికల్లో ఓట్ల కోసం అమరావతిని తరలించడంలేదని వైఎస్ జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలంతా చెప్పారు అని, ఇప్పుడు మూడు రాజధానులంటున్నారు అని, మీకు అమరావతి మీద, భూములు ఇచ్చిన రైతుల మీద చిత్త సుద్ధి ఉంటె కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిథులు రాజీనామా చేయాలి అని, వైసీపీతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి అని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరుపున మేము డిమాండ్ చేస్తున్నం అని ఆయన తెలిపారు. అలాగే మా అధ్యక్షుల వారి మాట ప్రకారం అమరావతి విషయంలో అవసరం ఐతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉంటామని, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకి అండగా ఉంటామని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరుపున తెలియచేస్తున్నాము అని ఆయన తెలిపారు.