Logo
Date of Publish : 22 November 2022, 3:19 pm
Editor : Sake Naresh

కాలువ నిర్మాణం చేయకపోవడంతో నీట మునుగుతున్నాం

• పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద వాపోయిన ప్రజలు

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 190వ రోజున 42వ డివిజన్ కోటమిట్ట కాలువ వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఈ ప్రాంతంలో కాలువ వెంబడి ఇళ్ళ నిర్మాణాలు కల్గిన ప్రజలు తమ ఆవేదన చెప్పుకుని వాపోయారు. ఇక్కడ నూతన కాలువ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, కానీ నేటికీ నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల మరియు పాత కాలువని పూడికతీత తీయించకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి కూడా తమ ఇళ్ళు నీట మునిగి బయటకు కదలలేక నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి, స్థానిక వైసీపీ నాయకులకు తమ బాధని ఎన్నిసార్లు చెప్పుకున్నా పరిష్కారం లభించట్లేదని అన్నారు. వారి సమస్యను సావధానంగా విన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి స్థానిక జనసేన నాయకులు తీసుకెళ్తారని, వారు పరిష్కరించని పక్షంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవబోయేది తామేనని, దగ్గరుండి ఈ సమస్యని పరిష్కరిస్తానని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com