కరోనా వైరస్ అంటే ఏమిటి?
భూమి మీద ఉన్న చాలా వైరస్లలానే కరోనా వైరస్ జంతువులకు మరియు మనుషులకు హాని కలిగిస్తుంది. ఈ కరోనా వైరస్లు సాధారణ జలుబు మొదలుకొని ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిటరీ సిండ్రోమ్ (MERS) మరియు సెవర్ అక్యూట్ రెస్పిటరీ సిండ్రోమ్ (SARS) వంటి వ్యాధులను మానవులకు కలిగిస్తాయి. అయితే ఈమధ్యనే కనిపెట్టబడిన కొత్త కరోనా వైరస్ కోవిడ్-19 వ్యాధిని కలిగిస్తుంది.
కోవిడ్-19 అంటే ఏమిటి?
కోవిడ్-19, ఇటీవల కనుగొన్న కరోనా వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. డిసెంబర్, 2019 లో చైనాలోని వుహాన్‌లో బయటపడినప్పుడే ఈ వైరస్ మరియు వ్యాధి గురించి అందరికీ తెలిసింది.
కోవిడ్-19 యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
కోవిడ్-19 యొక్క సాధారణ లక్షణాలు జ్వరం, అలసట మరియు పొడిదగ్గు. కొంతమందిలో శరీర నొప్పులు, జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి మరియు డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు క్రమక్రమంగా కనిపిస్తాయి. కొంతమందిలో ఈ వైరస్ ఉన్నప్పటికీ పై లక్షణాలేవి కనిపించవు మరియు సాధారణంగానే కనపడతారు. రోధ నిరోదక శక్తి బాగా ఉన్న శరీరాల్లో ఇది అంత తొందరగా ప్రభావం చూపలేదు. చాలా మంది (80% కు పైగా) ఎటువంటి ప్రత్యేక వైద్యాన్ని తీసుకోకుండానే ఈ వ్యాధినుండి బయటపడతారు. ఒక అంచనా ప్రకారం కోవిడ్-19 సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు మరియు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. వృద్దులు మరియు హై బీపీ,గుండె సమస్యలు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడేవారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు తక్షణమే డాక్టర్ ను సంప్రదించడం శ్రేయస్కారం.
కోవిడ్-19 అనే వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది?
కోవిడ్-19 అనేది అంటువ్యాధి. కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు ద్వారా ఈ వ్యాధి ఎక్కువ శాతం వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లు ఏవైనా వస్తువులపై లేదా ఆ మనిషి చుట్టూ మాత్రమే ఉంటాయి. ఇతరులు ఈ వస్తువులను లేదా ఆ మనిషి దగ్గరికి వచ్చి తాకిన తరువాత వాళ్ళ కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకడం ద్వారా వాళ్ళల్లో కూడా ఈ వైరస్ ప్రవేశిస్తుంది. కోవిడ్-19 వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు వచ్చే తుంపర్లను వేరే వ్యక్తి పీల్చినపుడు కూడా ఈ వైరస్ తనలో ప్రవేశిస్తుంది. ఈ కారణం చేతనే అనారోగ్యంగా ఉన్న వ్యక్తి నుండి కనీసం 1 మీటర్ (3 అడుగుల) కు పైగా దూరంలో ఉండేల జాగ్రత్త తీసుకోవడం మంచిది.
కోవిడ్-19 వ్యాధి సోకిన వ్యక్తుల మలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందా?
కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తుల మలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుత ప్రాధమిక పరిశోధనలు మలంలో ఈ వైరస్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, దీని ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువనే ధృవీకరిస్తున్నాయి. ఏమైనప్పటికీ, బాత్రూమ్ను ఉపయోగించిన తరువాత మరియు తినే ముందు చేతులను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవడం మంచిది.
కోవిడ్-19 నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మరియు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఏమి చెయ్యాలి?
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ సోకకుండా మరియు కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా చెయ్యవచ్చు:
1.మార్కెట్లలో దొరికే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బు మరియు నీటిని ఉపయోగించి తరచుగా చేతులను కడుక్కోవాలి. ఎందుకంటే,ఇలా చెయ్యడం ద్వారా మన చేతులపై ఉన్న వైరస్లు చనిపోతాయి.
2.ఎవరైనా దగ్గుతున్నా లేదంటే తుమ్ముతున్న వారి నుండి కనీసం1 మీటర్ (3 అడుగుల) దూరంలో ఉండేల చూసుకోవాలి. ఎందుకంటే, ఎవరైనా దగ్గినప్పుడు లేదంటే తుమ్మినప్పుడు వారు ఈ వైరస్ ఉన్న తుంపర్లను వెదజల్లుతారు. అప్పుడు మనం దగ్గరగా ఉంటే, ఆ తుంపర్లను పీల్చడం ద్వారా ఈ వైరస్ మనలో ప్రవేశిస్తుంది.
3.చేతులతో మన కళ్ళను,ముక్కును మరియు నోటిని తాకొద్దు. ఎందుకంటే, చేతులతో చాలా వస్తువులను తాకడం ద్వారా వైరస్ మన చేతులపై ఉంటుంది. అలా కలుషితమైన చేతులతో ముక్కును, కళ్ళను లేదా నోటిని తాకడం ద్వారా ఈ వైరస్ మనలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ.
4.మనం మరియు మన చుట్టూ ఉన్నవారు పరిశుభ్రత పాటించేటట్లు చూసుకోవాదం మంచిది. దీనర్ధం,దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మోచేతిని లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవడం. తరువాత టిష్యూ పేపర్‌ను మడిచి వీలున్న చెత్తబుట్టలో వెయ్యడం. ఎందుకంటే తుంపర్లు, వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇలాంటి పరిశుభ్రమైన అలవాట్లను పాటించడం ద్వారా జలుబు, ఫ్లూ మరియు కోవిడ్-19 వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.
5.మన ఆరోగ్యం బాగోలేకపొతే ఇంటిలోనే ఉండేలా చూసుకోండి. మనకు జ్వరం,దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే కాల్ చేసి డాక్టర్‌ను వెంటనే సంప్రదిండం మంచిది. హెల్త్ అథారిటీ చెప్పిన సూచనలు పాటించంలి. ఎందుకంటే, జాతీయ మరియు స్థానిక అథారిటీల వద్ద మనమున్న ప్రాంతానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ముందుగా కాల్ చెయ్యడం వలన హెల్త్ కేర్ ప్రొవైడర్ మనల్ని వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్తారు. దీని వలన వైరస్ మరియు ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.
6.మన ఇంటిలో కానీ బంధువుల ఇళ్ళల్లో కానీ వృద్దులు లేదా మధుమేహం,గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, వీరికి కోవిడ్-19 వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
మనకు కోవిడ్ -19 సోకే అవకాశాలు ఎంత మాత్రం ఉంటాయి?
కోవిడ్-19 వచ్చే ప్రమాద అవకాశాలు మనముండే ప్రదేశం బట్టి ఉంటాయి. మరీ ముఖ్యంగా, మనముండే ప్రదేశంలో కోవిడ్-19 వ్యాప్తి చెందుతుందా లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. చాలా ప్రదేశాలలో ఉన్న ఎక్కువ మంది ప్రజలకు కోవిడ్-19 సోకే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, ప్రపంచంలోని (నగరాలు మరియు ప్రాంతాలు) కొన్ని ప్రదేశాలలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతోంది. ఈ ప్రదేశాలలో నివసించేవారు మరియు చూడడానికి వచ్చే వారు కోవిడ్-19 బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. కొత్త కోవిడ్-19 కేసు బయటపడినప్పుడల్లా ప్రభుత్వాలు మరియు హెల్త్ అథారిటీస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. యాత్రలు, ప్రయాణాలు లేదంటే ఎక్కువ మంది కలిసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమైన పని. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా సహాయపడడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. దురృష్టవశాత్తు, ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. మనముండే ప్రదేశం గురించి మరియు వెళ్లాలనుకునే ప్రదేశం గురించి తెలుసుకోని జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
మనం కోవిడ్-19 గురించి కంగారుపడాలా?
చిన్న పిల్లలు మరియు యుక్త వయస్సులో ఉన్నవారిలో కోవిడ్-19 లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. ఏమైనప్పటికీ, ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరికి తీవ్ర అనారోగ్యం ఉంటుంది, వారు వెంటనే హాస్పిటల్లో చేరాలి. అందుకే కోవిడ్-19 మనల్ని మరియు మనకు కావాల్సిన వారిని ఎంత మేరకు అనారోగ్యానికి గురిచేస్తుందనే సందేహాలు మనకు ఉంటాయి. మనల్ని, మనకు కావాల్సిన వారిని మరియు మన చుట్టూ ఉండేవారిని మనం రక్షించుకోవచ్చు. ముందుగా చెయ్యాల్సినది, తరచుగా చేతులు కడుక్కోవడం, అన్నివేళల మాస్క్ ధరించి ఉండటం మరియు పరిశుభ్రముగా ఉండేలా చూసుకోవడం. రెండవది, ప్రయాణాలలో మరియు ఎక్కువ మందిని కలిసే చోట స్థానిక హెల్త్ అథారిటీస్ జారీ చేసిన సూచనలను పాటిస్తు జాగరూకతతో వ్యవహరించడం.
కోవిడ్-19 రాకుండా లేదా తాత్కాలిక ఉపశమనం కొరకు ఆంటీ బయోటిక్స్ వాడొచ్చా?
లేదు. ఆంటీ బయోటిక్స్, బాక్టీరియాతో పోరాడగలవు కానీ వైరస్‌తో పోరాడలేవు. కోవిడ్-19 వైరస్ వలన వస్తుంది కాబట్టి ఆంటీ బయోటిక్స్ పని చేయవు. కోవిడ్-19 సోకకుండా ఆంటీ బయోటిక్స్ ను ఉపయోగించకూడదు. వాటిని కేవలం డాక్టర్ సూచన మేరకు మాత్రమే బాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్ కు ఉపయోగించాలి.
కోవిడ్-19 కు ఏమైనా వాక్సిన్, మందు లేదా చికిత్స ఉన్నాయా?
ప్రస్తుతం భారతదేశంలో మందు తయారుచేయడమే కాదు, పదుల సంఖ్యలో ఇతర దేశాలకు ఇది ఎగుమతి కూడా దశలవారిగా జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలోని అన్నీ రాష్ట్రాల్లో 45 సంవత్సరాలు వయస్సు పైబడిన వారందరికీ ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఇది అనేక రాష్ట్రాల్లో దశలవారిగా జరుగుతుంది. అక్కడక్కడ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొన్ని ఆరోగ్య ఇబ్బందులు తలెత్తిన అవి కేవలం ఇదివరకు అనారోగ్యం (కోవిడ్-19 కాకుండా వేరే రోగాలతో) బాధపడుతూఉండేవారిలో మాత్రమే. అది కూడా చాలా చాలా స్వల్పమే. అన్నీ జాగ్రత్తలతో కూడిన స్వీయ రక్షణ సమకూర్చుకుంటే ఏ వైరస్ ఏమి చేయలేదు. నిర్లక్ష్యం చేయకూడదు.
కోవిడ్-19 మరియు SARS రెండూ ఒక్కటేనా?
కాదు. కోవిడ్-19 మరియు 2003 లో వచ్చిన సెవర్ అక్యూట్ రెస్పిటరీ సిండ్రోమ్ (SARS) యొక్క కారకాలు ఒకే జన్యుజాతికి సంబంధించినవి అయినప్పటికి అవి కలగజేసేవ్యాధులు వేరే. కోవిడ్-19 తో పోలిస్తే SARS ఎక్కువ ప్రమాదకారి మరియు తక్కువగా ఇతరులకు సోకుతుంది. అయితే 2003 తరువాత ఒక్క SARS కేసు కూడా నమోదు కాలేదు.
ముఖానికి మాస్క్ ఎలా ధరించాలి, వాడిన తరువాత దానిని ఎలా పారేయాలి?
1.మాస్క్ ని ముట్టుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్,సబ్బుతో గానీ చేతులని శుభ్రం చేసుకోవాలి.
2.మాస్క్ వాడే ముందు దానికి రంధ్రాలు కానీ,చిరుగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి.
3.మాస్క్ ఎటువైపు సరిగ్గా ఉందో చూసి వాడాలి. మెటల్ స్ట్రిప్ ఎటువైపు ఉంటుందో అదే పై భాగం అన్నట్లు గుర్తించాలి.
4.మాస్క్ వాడిన తర్వాత దానిని ఎలాస్టిక్ లూప్స్,అంటే మనం చెవులకి తగిలించే దారాలతో మెల్లిగా తీయాలి, అంతే కానీ, మధ్యభాగంలో పట్టుకోకూడదు. అలా తీసి పారేయాలి.
5.తీసేసిన మాస్క్ ని వెంటనే చెత్తకుండిలో పారవేయాలి. ఒకసారి వాడిన మాస్క్ ఇంకోసారి వాడే ముందు శుభ్రంగా ఉతికి వాడాలి. ఎప్పుడు ఒకటికి రెండు మాస్క్ లు ఉంచుకోవడం మంచిది. ఒకరు వాడిన మాస్క్ ఇంకొకరు వాడకూడదు. అది ఇంట్లో వారైనప్పటికి కూడా వాడకూడదు.
కోవిడ్-19 సోకిన తరువాత మనలో దాని లక్షణాలు కనిపించేందుకు ఎంత సమయం పడుతుంది?
ప్రస్తుత ఆరోగ్య ప్రతినిధుల ప్రకారం కోవిడ్-19 లక్షణాలు తెలుసుకోవడానికి అత్యల్పంగా 1 రోజు నుంచి గరిష్టంగా 14 రోజుల సమయం పడుతుంది.
జంతువుల కారణంగా కోవిడ్-19 మనుషులకి వచ్చే అవకాశం ఉందా?
అది ఖచ్చితంగా చెప్పలేము కానీ జంతువులకు లేదా పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా వయసు పైబడిన వారు మరియు చిన్న పిల్లలను జంతువుల నుండి ఎంత దూరమ ఉంచితే అంతా మంచిది. అదే విధంగా మంచి ఆహారం తీసుకోవడం ఉత్తమం. అన్ని సమయాల్లో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉండే కాయగూరలు పండ్లను ఆహారంగా తీసుకోవడం అత్థ్యుత్తమం.
వస్తువుల/పదార్థాల ఉపరితలాలపై కరోన వైరస్ ఎంతకాలం జీవించి ఉంటుంది?
కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ ఉపరితలాలపై ఎంతకాలం జీవించి ఉంటుందో కచ్చితంగా చెప్పలేము. అవి ఆయా వాతావరమ్ పరిస్థితులు, పదార్థాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే కరోనా వైరస్ కొన్ని గంటలు, చాలా రోజుల వరకు ఉపరితలాలపై ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి మనల్ని కాపాడుకోవాలనుకుంటే మన చేతులని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా కళ్లు, నోరు, ముక్కుని తాకడం చేయకూడదు.
కోవిడ్-19 పరీక్ష ఎలా చెయ్యబడుతుంది?
కరోనా వైరస్ పరీక్ష కోసం రక్త నమూనాలను తీసుకోరు. కరోనా వైరస్ పరీక్షలో భాగంగా ముందుగా మన గొంతు మరియు నాసికలను పరీక్షిస్తారు. మన సాంపిల్స్ ను తీసుకొని నోడల్ హాస్పిటల్స్ కు పంపిస్తారు. అలానే మన శారీరక ఆరోగ్యాన్ని పరీక్షించి హాస్పిటల్లో చేరవలసిన అవసరం గురించి చెప్తారు. లేదంటే, మనల్ని ఇంటిలోనే ఐసోలేట్ (నిర్బంధం) లో ఉండమని చెప్తారు. టెస్ట్ లో పాజిటివ్ వస్తే, మనం కనీసం 14 రోజులు, లేదంటే పూర్తిగా తగ్గేంతవరకు క్వారంటైన్లో ఉండటం శ్రేయస్కరం. ప్రస్తుతం కోవిడ్-19 ను పరీక్షించే సమయం మునుపటితో పోలిస్తే చాలా తగ్గింది.
ఒకసారి కోవిడ్-19 నుండి కోలుకున్న తరువాత మళ్ళీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా?
ప్రస్తుతానికైతే ఇది ప్రస్తుతానికి ఖచ్చితంగా అవును లేదా కాదు అని ధృవీకరించలేము. ఒకసారి జ్వరం వచ్చి తగ్గిపోయాక మనకు మళ్ళీ జ్వరం రాదు అని గ్యారంటీ లేదు కదా? కాబట్టి కరోనా కూడా అలాగే. మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అన్నింటికీ ముందు జాగ్రత్తలే ఉత్తమం.
రోగ నిరోధక శక్తి మనల్ని కరోనా వైరస్ నుండి కాపాడుతుందా?
ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థపై ఆధారపడి వైరస్ ప్రభావాలు కనిపిస్తాయని ఇప్పటికే పలు నిపుణులు అంటున్నారు. WHO, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం, వృద్దులు మరియు ఇదివరకే వేరే వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ వైరస్ బారినపడే అవకాశం ఎక్కువ. ఇతరులతో పోలిస్తే, వృద్ధాప్యం మరియు తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్న వారు కోవిడ్-19 తో పోరాడడం చాలా కష్టంగా ఉంటుంది. గుండె జబ్బులు, మధుమేహం లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు మరియు ఈ వైరస్‌తో పోరాడలేరు.
అన్ని వయసుల వారికి ముందు జాగ్రత్తలే ఉత్తమం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం, ప్రయాణాల్లో తప్పకుండ ముఖానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండటం, ఆరోగ్యకరమైన మరియు రోగ నిరోధక శక్తి కలిగిన కూరగాయలను పండ్లను ఆహారంగా తీసుకోవడం, అలాగే వీలైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకోకపోవడం మనల్ని కరోనా నుండి కాపాడుతుంది.
#Written By
కొన్నిపాటి రవి
ట్విట్టర్ ఐడి : @KPR_India
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com