Search
Close this search box.
Search
Close this search box.

లాక్ డౌన్ కాలంలో చాప కింద నీరులా జనసేన : బొలిశెట్టి సత్యనారాయణ

లాక్ డౌన్ కాలంలో చాప కింద నీరులా జనసేన : బొలిశెట్టి సత్యనారాయణ

           కొత్త తరం రాజకీయాలు (#JSPForNewAgePolitics) అనే హ్యాష్ ట్యాగ్ తో చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఉన్నా రాజకీయ పార్టీలు నాయకులు పట్టించుకోలేదు.. కానీ, ఈ కరోనా సమయంలో జనసేనాని తన సైన్యాన్ని నడిపిస్తున్న తీరు మేధావుల్ని సైతం ఆకట్టుకుంటోంది.. నిశితంగా గమనిస్తే రాజకీయాలని పక్కనపెట్టి.. పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష, ప్రకృతి వ్యవసాయం, ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, పేదవారికి నిత్యావసర వస్తువులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కోట్ల రూపాయలు ఆర్థిక సాయం వంటివే కాకుండా పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం రోజు కూడా వినూత్న రీతిలో లక్షలాది మొక్కలు నాటడం. విజ్ఞులు ఇదే కొత్త తరం రాజకీయం అని అంటున్నారు. ఇక ఈ మధ్య జరిగిన మన నుడి మన నది వెబినార్లు చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది.. అసలు మన నుడి మన నది కార్యక్రమమే ప్రజలు ఏం కోల్పోతున్నారో తెలియజేసే ఒక కొత్త తరం రాజకీయ ఎత్తుగడ..

            మన నుడి (అంటే మన భాష) అంటూ మారు మూల ఉన్న వృద్ధులతో, బాషా పండితులతో కలసి వారి బాషా, నదీ జ్ఞానాన్ని భావితరాలకి అందించడం. అలాగే మన నది అంటూ నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాల ప్రజలతో, విద్యార్థులతో, పర్యావరణ ప్రేమికులతో కలిసి పెద్దల నుండి సేకరించన జ్ఞానాన్ని, డాక్టర్ రాజేంద్ర సింగ్ గారి నదీ పునరుజ్జీవన అనుభవంతో సంధానం చేసి తెలుగు రాష్ట్రాల్లో నదులను, జలాశయాలను పునరుజ్జీవింప జేయడం.. ఇది సాధిస్తే జనసేన ప్రజల మనసులు చూరగొని తద్వారా సామాజిక పరివర్తన చేసి రాజకీయ లబ్దికూడా పొందుతుంది. ఈ దిశగా మొదటి అడుగు పడిందనే చెప్పాలి, ఎందుకంటే ఈ వరుస వెబినార్ల ఒక్కో వెబినార్ దాదాపు 3గంటల పాటు సాగింది. వారికి జనసేన అన్ని సోషల్ మీడియా ఛానెల్స్ లైవ్ ప్రసారం చేసి విషయాన్ని ప్రతి జనసైనికునికి చేరేలా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

            అలాగే #మననుడిమననది మొదటి కార్యక్రమం, 6 వెబ్‌నార్లకు జనసేన ప్రధాన కార్యదర్శి పర్యావరణ బొలిశెట్టి సత్యనారాయణనే పర్యవేక్షించారు. దీనికి ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చెయ్యడం, ఇది పార్టీ యొక్క ముఖ్య కార్యక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే ఈ 6 వెబ్‌నార్లతో కూడిన మననుడి మననది యొక్క అవగాహన కార్యక్రమాన్ని చూస్తే దీని వెనుక పైన చెప్పిన కొత్త తరం రాజకీయం అనే పెద్ద వ్యూహం ఉందని సులువుగా తెలుస్తుంది.

1. నుడి .. నది .. ఇప్పుడు – శ్రీ ఎంవిఆర్ శాస్త్రి (ప్రఖ్యాత సంపాదకుడు, రచయిత మరియు చరిత్రకారుడు)

2. రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన బాధ్యతలు, ప్రకృతిని మరియు దాని వనరులను పరిరక్షించాల్సిన పౌరుల బాధ్యత – జస్టిస్ శ్రీ వి గోపాల గౌడ (మాజీ న్యాయమూర్తి సుప్రీంకోర్టు మరియు రాజ్యాంగ చట్టంలో నిపుణుడు)

3. పర్యావరణాన్ని పరిరక్షించడంలో అడవుల పాత్ర – శ్రీ టి శివ శంకర్ రావు (ఒక భూవిజ్ఞాన శాస్త్రవేత్త, మాజీ జాయింట్ కమిషనర్ GST)

4. ఆయుర్వేద వైద్యుడు వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా మారారు – శ్రీ మాడభూషి శ్రీధర్ గారు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారిని ఇంటర్వ్యూ చేశారు, ఇద్దరూ ఆయా రంగాలలో నిపుణులే

5. మన నదులను, సముద్రాన్ని ప్లాస్టిక్ కాలుష్యం లేకుండా ఎలా ఉంచగలం – శ్రీ వినోద్ బోధంకర్ (సాగర్ మిత్రా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, దీనిని 250000 పాఠశాల పిల్లలతో విజయవంతంగా ప్రదర్శించారు మరియు ప్రపంచవ్యాప్తంగా వారి పరిధులను విస్తరించారు.

6. గత 20 సంవత్సరాలుగా ప్రవహించని మహారాష్ట్రలోని ఆగ్రా ని  నది పునరుజ్జీవన కార్యక్రమానికి నాయకత్వం వహించిన శ్రీ నరేంద్ర చుగ్ (జలబీరాదిరి పూణే నుండి, 107 గ్రామాల నుండి 305000 మంది ప్రజలు 6 మందికి ఎలా పనిచేశారు? సంవత్సరాలు మరియు చనిపోయిన నదిని పునరుద్ధరించింది మరియు ఇది ఇప్పుడు శాశ్వతంగా ప్రవహిస్తోంది, భూమిపై అమలు చేయబడిన మరొక విజయ కథ కూడా భాగస్వామ్యం చేయబడింది.

                   ఆఖరున మేం రాయలసీమలో అన్ని నదులను మేం పునరుద్ధరిస్తామని, తెలుగు రాష్ట్రాల్లో సహజ వనరులను పరిరక్షిస్తామని అంటూ ప్రజలకు ఒక కొత్త దిశ వైపుగా మల్లించడంలో నిమగ్నమై ఉన్నారు.. అందుకే చాపకింద నీరులా జనసేన అంటున్నా..

గమనిక : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ సంరక్షకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక దినపత్రికకు ఇచ్చిన వ్యాసంను మీ ముందు ఉంచాము. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way