దెందులూరు, (జనస్వరం) : "గెలుపు ఓటములు మనల్ని ఆపలేవు. గెలిచినా ఓడిన ప్రజల అవసరాలకోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం" అని చెప్పిన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల స్ఫూర్తిగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు నియోజకవర్గంలోని అమ్మపాలెం గ్రామానికి ఆ గ్రామ జనసైనికులు అందరూ కలిసి ప్రజల అవసరాల కోసం 2 లక్షల రూపాయిల విలువ అయిన వాటర్ ట్యాంకర్ ని చేయించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో నీటి కొరత ఉండడంతో ప్రజలు కష్టాలు తెలుసుకొని ఈ వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామంలో నీటి కొరత లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com