
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నా అన్నీ వార్డులలోని డ్రైనేజీలు నిండిపోయి అవనిగడ్డ మొత్తం మురుగు దిగ్బందంలో ఉందని జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు గారు అన్నారు. మీరు ఎన్ని సారులు అయినా చెప్పండి మేము ఇంతే అనే తీరులో పాలకులు, అధికారులు ఉన్నారు అంటే చాలా బాధాకరం. డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయించండి అనీ ఎన్నో అర్జీలు ఇచ్చినాము ఫలితం శూన్యం. రెండు ఏళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన జరిగింది అప్పుడు డ్రైనేజీలు గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు నూతన పంచాయతీ బోర్డు ఏర్పాటు అయ్యింది. వేసవికాలంలో బాగుచేయించవలచిన డ్రైనేజీలు బాగుచేయించలేదు. ఇప్పుడు వర్షకాలం వస్తుంది. వేసవికాలంలోనే ముక్కులు ముచుకుపోయే చెడువాసనతో డ్రైనేజీలు ఉన్నాయి. వర్షకాలంలో ఆ మురుగు నీరు ఎటుకదలక ప్రధాన రోడ్డులు మీదకు వచ్చే పరిస్థితి. ఒక ప్రక్క ప్రజలు కోవిడ్ -19 తో బయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా పాలకులు, అధికారులు కదలని మురుగు నీరు డ్రైనేజీలు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యం గురించి పట్టించుకోరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు అధికారులు స్పందించి ఇలాంటి కరోనా పరిస్థితిలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోని గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అన్నీ వార్డులో ఉన్న డ్రైనేజీలు వెల్లవేయించి, మురుగు నీరు బయటకు పోయే ఏర్పాటు చేసి బ్లీచింగ్, దోమలు మందు కొట్టించాలి అనీ జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము అన్నారు.