Logo
Date of Publish : 10 October 2023, 9:18 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ సాగిన ఓటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

         నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు రూరల్,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే కార్యక్రమం 5వ రోజు నెల్లూరు రూరల్ ధనలక్ష్మిపురంలో జరిగింది. యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు మాకు ఇష్టం, ఇంట్లో వారికి కూడా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా చెబుతామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు యువతకు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావడం లేదు.  చదువుకున్న యువత అంతా కూడా ఉద్యోగాల కోసం రాష్ట్రం దాటి పోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాల కు కూడా ఏ విధమైన రుణ సహాయాలు కూడా అందడం లేదు. పరిపక్వత లేని నాయకుడు పరిపాలించడం వల్ల రాష్ట్రం నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా రాజధానికి నోచుకోలేదు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాలి.  మీ కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారిని జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మీరందరూ తెలుపండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కూడా ఈ సారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సంఘీభావం తెలపాలి అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ జనసేన యూత్ వింగ్ సభ్యులు బన్నీ,కేశవ,వర,శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com