ప్రజలు ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వ ఏర్పాటు కొరకు రాజకీయ పార్టీల మీద తమ అభిప్రాయాన్ని ప్రత్యక్ష పద్దతిలో వ్యక్తం చేసే ప్రక్రియే ఓటింగ్. పరిపాలన చేసే రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా దేశ పౌరులు తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియచేస్తారు. రాజకీయ పార్టీలకు చెందిన వారు ఎన్నుకోబడటం ద్వారా చట్టసభలలో సభ్యుడుగా మారి తమకు ఓటు వేసి గెలిపించిన తరుపున ప్రతినిధులుగా వ్యవరించాలి. దేశం ప్రస్తుతం నడుస్తున్న విధానంపై భవిష్యత్తులో కూడా చాలా ప్రభావం చూపుతుంది, కాబట్టి రాజకీయ వాతావరణం నిరంతరం మారుతున్న సమయంలో మనం సరైన నాయకుడిని ఎన్నుకుంటామని నిర్ధారించుకోవడానికి మన చేతిలో ఉన్న అస్త్రమే "ఓటు".
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా పనిచేస్తాయని అర్థం చేసుకోవడం ముఖ్యం. సరైన వ్యక్తులను నాయకుడిగా ఎన్నుకోకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ప్రభావితం అవుతారు. సరైన వ్యక్తికి ఓటు వేయడం మన చుట్టూ ఉన్న ప్రభావాన్ని చూపుతుంది. అభివృద్ధి, ఆర్థిక భద్రత, రక్షణ, సంక్షేమం లాంటి అంశాలపై ఎక్కువ కాలం పాటు ప్రభావితం చేస్తుందని ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల ద్వారా మరియు ప్రజల నుంచి అనే ప్రజాస్వామ్య అర్థాన్ని ఎన్నికలు నిర్ధారిస్తాయని అర్ధం చేసుకుని అవలంబిస్తే ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకుంటుంది.
స్వంత పరిపాలనను ఎంచుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య లక్షణం. ఇది ప్రతి విప్లవాన్ని నిర్వచిస్తుంది. ఇది మన తరంతో సహా గత తరాలు అనుభవించిన కష్టాల ద్వారా సంపాదించిన హక్కు. ఇది ఇతర పాలనా విధానాలు కాకుండా ప్రజాస్వామ్యాన్ని గుర్తించే హక్కు. దానిని ఆదరించాలి, విస్మరించకూడదు. ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాన్ని తెలియజేయగల సులభమైన మార్గాలలో ఓటింగ్ ఒకటి. ఇది మనకి నమ్మకం గల నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని ఇస్తుంది, తద్వారా మన అభివృద్ధికి వారు జవాబుదారీగా ఉంటారని విశ్వాసం కలుగుతుంది.
సామాజిక సమస్యల గురించి పెద్దగా పట్టించుకోని చాలా మంది ఓటర్లు తమ ఆర్థిక ప్రయోజనాల గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. మనం ఎన్నుకునే రాజకీయ నాయకులు మనం ఎంత పన్నులు చెల్లిస్తామో, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో నిర్ణయిస్తారు. మనం వేసే ప్రతి ఒక ఓటు మన ఆర్థిక వెసులుబాటును చివరికి మన ఆస్తి పన్నులు లేదా అమ్మకపు పన్నులు పెరుగుతాయో లేదో నిర్ణయిస్తాయి. ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు రక్షణ వ్యయం మన ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపే అంశాలు.ఈ డబ్భై ఐదేళ్ల స్వాతంత్య్రం ఎందరో త్యాగధనుల ఫలం, దేశం కోసం తనువు, మనసు సర్వం త్యాగం చేసిన ఎందరో పుణ్యమూర్తుల నిష్కామ త్యాగం. దానికి మనం కృతజ్ఞత చూపాల్సింది కేవలం ఓటు అనే ఒక అస్త్రంతో మాత్రమే.
మహిళలు, మైనారిటీలు, బలవంతులు, బలహీనులు అంటూ తేడా లేని సరైన హక్కు ఓటు. సామన్యుడికి ఓటు హక్కు కల్పించడం కోసం పోరాడుతూ ఎందరో సైనికులు, పౌర హక్కుల కార్యకర్తలు మరణించారు. మన పౌర బాధ్యతను నిర్వర్తించడానికి మనం వారికి రుణపడి ఉంటాము. ఎందరో సైనికులు ఇప్పటికీ యుద్ధాల్లో పోరాడుతూ మరణిస్తున్నారు. మనం అంగీకరించే సైనిక నిర్ణయాలు తీసుకునే నాయకులను ఎన్నుకోవడానికి ఓటు వేయండి. భారత దేశం యొక్క భవిష్యత్తు సామర్థ్యానికి ఓటు వేయడం ముఖ్యం. ఈరోజు మీరు వేసిన బ్యాలెట్లు మన పిల్లలు వారి తర్వాత వచ్చే అన్ని తరాల వారిపై ప్రభావం చూపుతుంది. వారు నివసించే ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ఓటు దోహదపడుతుంది.
మన రాజ్యాంగం మన నాయకులను మరియు ప్రతినిధులను ఎన్నుకునే విధానంలో మార్పుకు అవకాశం కల్పిస్తుంది. కానీ కొన్ని ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో వ్రాయబడ్డాయి మరియు ఈ సువిశాల, సుసంపన్న భారత దేశం అభివృద్ధి చెందుతున్నంత కాలం, ఈ హక్కు తీసివేయబడదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులలో ఓటు హక్కు ఒకటి. అది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు, కానీ అది చాలా ముఖ్యమైన హక్కు-మనం దాన్ని ఉపయోగిస్తేనే దేశానికి ప్రధాని ఎంత ముఖ్యమో ఓటు కూడా అంతే ముఖ్యం. మనం ఓటు వేయకపోతే, ప్రజాస్వామ్య ప్రక్రియలో పూర్తిగా విస్మరించినట్టు, ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లు, మనం ఓటు వేస్తేనే, మన దేశ , రాష్ట్ర పురోగతిలో అడుగడుగునా అడుగు వేస్తున్నట్లు, భాగస్వాములు అయినట్టు.
"ఓటు కేవలం బాధ్యత మాత్రమే కాదు, అది మన కర్తవ్యం."
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com